కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10వేల చొప్పున రుణాలు మంజూరు చేస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మనిర్భర్ పథకం రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో ఇప్పటివరకు 1,123 మంది చిరు వ్యాపారులకు 22 బ్యాంకుల ద్వారా రుణం జమ చేశామని తెలిపారు. 12 మాసాల్లో రుణ వాయిదాలు చెల్లించిన అనంతరం 20వేల రూపాయల రుణం పొందవచ్చని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ పథకం కింద వీధి వ్యాపారులకు, స్త్రీ నిధి పథకం కింద మహిళా సంఘాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు.
- ఇదీ చూడండి: సుశాంత్ కేసు: సీబీఐ దర్యాప్తులో బయటపడ్డ నిజాలు!