రైతులు.. ఆధునిక పద్ధతులతో లాభసాటి పంటలను సాగు చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వానాకాలం పంటల సాగు, ఆయిల్ ఫామ్ పంట పెంపకంపై నిర్వహించిన అవగాహన సదస్సుకి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి ఆయన హాజరయ్యారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చే పంటల గురించి వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు. డిమాండ్ దృష్ట్యా.. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచుకోవాలని వారికి సూచించారు.
రైతుల సంక్షేమ కోసం తెరాస ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని మంత్రి ప్రస్తావించారు. పంట పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. అధికారులు సూచనల మేరకు పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. జిల్లాలో 1.92 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించగా.. అన్నదాతలకు రూ. 350 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Kaleshwaram: కాళేశ్వరం పుష్కర ఘాట్లను తాకిన గోదావరి పరవళ్లు