ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన ఇంటి ఆవరణలో పరిసరాలను శుభ్రం చేస్తానని తెలిపారు.
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి పేర్కొన్నారు. ఇంటి వద్ద పిచ్చిమొక్కలు, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ.. గ్రామస్థులను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ లోక భూమారెడ్డి, సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.