నిర్మల్ జిల్లా తనూర్ మండలంలో చిరుత పులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా .. బోసి గ్రామనికి చెందిన రైతు బాలేరవు ఉత్తమ్ వేకువజామున శనగ పంటను చూసేందుకు పొలానికి వెళ్లగా.. అక్కడ రెండు చిరుత పులులను చూసి భయాందోళనకు గురై.. ఊర్లోకి వచ్చి గ్రామస్థులకు తెలియజేశాడు. ఈ భయంతో రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు.
చర్యలు తీసుకోండి
పంట పొలాల్లో చిరుతల సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం ఇచ్చిన వారు రాలేదని వాపోయారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుని, చిరుతల బెడద నుంచి తమని కాపాడాలని కోరుతున్నారు.