భాజపా పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన హత్యాచార ఘటనను తీవ్రంగా నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట యూపీ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
యూపీలోని హ్యాథ్రస్ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ యువతిపై హత్యాచారం చేసిన నిందితులను శిక్షించడంలో కేంద్రం విఫలమైందని వామపక్ష నాయకులు విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ కరవైందని వామపక్ష నేతలు ఆరోపించారు.
ఇదీ చదవండిః అసెంబ్లీ ముట్టడికి భాజపా యత్నం.. ఉద్రిక్తం