ETV Bharat / state

‘రంగారి’ గుడిసె.. ఊరంతా ఒకే కుటుంబం.. - ts news

Joint Family form a Special Village: ఒక్క గుడిసె వేసుకుని బతికిన ఓ కుటుంబం ఓ ఊరిగా ఏర్పడింది అంటే నమ్ముతారా?. నిజమండీ... అదెలానో తెలుసుకోవాంటే ఈ కథనాన్ని చదవాల్సిందే..

‘రంగారి’ గుడిసె.. ఊరంతా ఒకే కుటుంబం..
‘రంగారి’ గుడిసె.. ఊరంతా ఒకే కుటుంబం..
author img

By

Published : Feb 26, 2022, 6:26 PM IST

Joint Family form a Special Village: అది 1940వ దశకం. కాకులు దూరని కారడవిలా ఉండే అడవిలో ఒక్క గుడిసె వేసుకుని బతికిన ఆ కుటుంబం ఓ ఊరిగా ఏర్పడింది. నిర్మల్‌ జిల్లా భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన ‘రంగారి’ నర్సింగ్‌ రుక్మాబాయి దంపతులది వ్యవసాయాధారిత కుటుంబం. వారికి అప్పట్లో 300 పశువులు ఉండేవి. వాటిని మేపడానికి వెళ్లినప్పుడు పక్కచేలలో పడి పంటలు పాడై గ్రామ రైతులనుంచి చివాట్లు ఎదుర్కోక తప్పలేదు. ఇదేమని భావించిన ఆ రైతు అక్కడి శివారులో ఊరికి 2కి.మీ దూరంలోని అడవిలో తనకున్న సుమారు 150 ఎకరాల బీడు భూమిలోని ఓ చోట గుడిసె వేసుకుని అక్కడే ఉండేవారు. భూమి చదును చేస్తూ పశువులను కాసేవారు.

వారికి ఒకే కూతురు మైనాబాయి జన్మించగా.. అల్లుడిగా లక్ష్మణ్‌ను ఇల్లరికం తీసుకొచ్చారు. వారికి ఏడుగురు సంతానం. ఇద్దరు కుమారులు, అయిదుగురు కుమార్తెలు. అయితే వారి కూతుళ్లకు సైతం ఇల్లరికం అల్లుళ్లను తీసుకొచ్చారు. అందరితో సుమారు 60 సంవత్సరాలు ఉమ్మడి కుటుంబం కొనసాగించారు. గుడిసెలు సరిపోక తన వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మించుకుని వేర్వేరుగా ఉంటున్నా.. ఆలనపాలన మాత్రం కుటుంబ పెద్దనే చూస్తుండేవారు.

కాలక్రమంలో గ్రామంగా విస్తరించిన ఆ పల్లెలో 25 కుటుంబాలు ఉన్నాయి. 45మంది ఓటర్లు, 105మంది జనాభా ఉన్నా ఆ ఊరిని ఇప్పటికి ‘రంగారి గుడిసె’ అని పిలుస్తున్నారు. చదువు అంతంత మాత్రమే ఉన్నా తమకున్న నైపుణ్యంతో నర్సింగ్‌ వారసత్వంగా డీజిల్‌ ఇంజిన్లు, ఎలక్ట్రానిక్‌ మోటార్లు మరమ్మతులు చేస్తూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.

‘రంగారి’ గుడిసె.. ఊరంతా ఒకే కుటుంబం..
‘రంగారి’ గుడిసె.. ఊరంతా ఒకే కుటుంబం..
రంగారి గుడిసె గ్రామం

ఆదర్శం..

ఇప్పుడు విడిగా ఉన్నప్పటికీ అన్ని కుటుంబాలు అన్యోన్యంగా ఉంటూ పండగలు వచ్చినప్పుడు అంతా కలిసి ఒకే చోట నిర్వహిస్తున్నారు. పెద్దల మాటకు తిరుగులేదు. వినాయక చవితి, దుర్గాదేవి నవరాత్రులు కనుల పండువగా జరుపుకొంటారు. రోజుకో కుటుంబం చొప్పున వంటలు చేసి అందరు సహపంక్తి భోజనాలు చేస్తారు. మద్యానికి దూరంగా ఉంటూ.. కులమతం ప్రసక్తి లేకుండా కులాంతర వివాహాలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకరికి కష్టం వస్తే అందరూ ఆదుకుంటారు.

రోడ్డులేక అవస్థలు
రోడ్డులేక అవస్థలు

పది కుటుంబాలుగా ఏర్పడ్డాం

'నా చిన్నతనం నాటి నుంచే ఈ అటవీ ప్రాంతానికి వచ్చి గుడిసె వేసుకొని అమ్మానాన్నతో కలిసి ఉంటున్నాం. ఆనాటి కాలంలో మాకు 300 పశువులు ఉండేవి. ఇతరులతో మాకు ఇబ్బందిగా ఉండడంతో కుటుంబంతో పాటు వచ్చి ఇక్కడే ఉండిపోయాం. ఇప్పుడు పది కుటుంబాలుగా ఏర్పడ్డాం. కానీ మా గ్రామపంచాయతీ అయిన వాలేగాం నుంచి సరైన రోడ్డుమార్గం కూడా లేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తిరిగి వెళ్లాల్సి వస్తోంది.'

-అనూషాభాయి, రంగారి గుడిసె గ్రామం

రోడ్డు సౌకర్యం కల్పించాలి..

'చిన్ననాటి నుంచి అటవీ ప్రాంతంలోనే ఉంటున్నాం. పెళ్లి అయినా ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు. వారు అటవీప్రాంతంలోనే ఉండడం వల్ల చదువులకు దూరమై వ్యవసాయం చేసుకుంటున్నారు. వారి పిల్లలకు కూడా స్కూల్​కు వెళ్లాలంటే చాలా కష్టంగా మారింది. మా గ్రామపంచాయతీ అయిన వాలేగాంకు, మా ఆవాసగ్రామానికి మధ్య మూడు కిలోమీటర్ల దూరం ఉంది. సరైన రోడ్డు లేక పది కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం రోడ్డు సౌకర్యం కల్పించాలి.'

-కళావతి, రంగారి గుడిసె గ్రామం

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.