ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి బస్‌డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బలవన్మరణానికి పాల్పడిన ఆర్టీసీ కార్మికుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఒకవైపు ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుంటే... మరోవైపు ముఖ్యమంత్రి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : శ్రీశైలంలో కొనసాగుతున్న వరద.. 3 గేట్లు ఎత్తివేత