ETV Bharat / state

గోదారమ్మకు రష్యా భక్తుల హారతి - బాసరలో గంగా హారతి

బాసర శ్రీజ్ఞాన సరస్వతీ పుణ్యక్షేత్రంలో గోదారమ్మకు వైభవంగా గంగా హారతి నిర్వహించారు. శ్రీవేద భారతి విద్యానందగిరి స్వామి చేతుల మీదుగా రష్యా భక్తులు గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

godavari aarti by russian devotees at basara in nirmal district
గోదారమ్మకు రష్యా భక్తుల హారతి
author img

By

Published : Dec 19, 2019, 9:09 AM IST

గోదారమ్మకు రష్యా భక్తుల హారతి

నిర్మల్​ జిల్లా బాసరలో గోదారమ్మకు ఘనంగా గంగా హారతి నిర్వహించారు. అనంతరం అభిషేకం, శివార్చన చేశారు.

శ్రీ వేద భారతి విద్యా నందగిరి స్వామి చేతుల మీదుగా రష్యాకు చెందిన భక్తులు నక్షత్ర హారతి, నాగహారతి, కుంభ హారతులు నిర్వహించి.. విశేష పూజలు చేశారు.

వేదమంత్రోచ్ఛరణల మధ్య పవిత్ర గోదారమ్మకు కన్నుల పండువగా హారతినిస్తున్న దృశ్యం చూసి భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.

గోదారమ్మకు రష్యా భక్తుల హారతి

నిర్మల్​ జిల్లా బాసరలో గోదారమ్మకు ఘనంగా గంగా హారతి నిర్వహించారు. అనంతరం అభిషేకం, శివార్చన చేశారు.

శ్రీ వేద భారతి విద్యా నందగిరి స్వామి చేతుల మీదుగా రష్యాకు చెందిన భక్తులు నక్షత్ర హారతి, నాగహారతి, కుంభ హారతులు నిర్వహించి.. విశేష పూజలు చేశారు.

వేదమంత్రోచ్ఛరణల మధ్య పవిత్ర గోదారమ్మకు కన్నుల పండువగా హారతినిస్తున్న దృశ్యం చూసి భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి కొలువైన పుణ్యక్షేత్రంలో గోదావరమ్మ తల్లికి నిత్యా గంగా హారతి అంగరంగవైవంగా జరిగింది, శ్రీ వేద భారతి పీఠం ఆధ్వర్యంలో గోదావరి నది తీరాన ఉన్న గోదారమ్మకు నీటితో అభిషేకం,శివర్చన నిత్య హారతులతో ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం శ్రీ వేద భారతి విద్యా నందగిరి స్వామి చేతుల మీదుగా రష్యా దేశానికి చెందిన భక్తులు ప్రత్యేక గంగా హారతి పూజలు చేశారు.ఈ సందర్భంగా శ్రీ వేద విద్యానందగిరి స్వామి మాట్లాడుతూ తరుచు అమెరికా లోని శ్రీ వేద భారతి పాఠశాల కు పోయి వచ్చే క్రమంలో అక్కడ నన్ను చూసి గురువుగా భావించే వారని అందుకే వారు నాకు శిష్యులు సునీల్ మీర్ చందాని,మర్ధి షినం అని అన్నారు, బాసర గోదావరి నది హారతిలో పాల్గొన్నారు అని అన్నారు. గోదారమ్మ తల్లికి గంగా హారతిని ఇచ్చారు. నిత్య హారతిలో భాగంగా ఋషికన్యలచే నిత్య గంగా హారతిలో సాయంత్రం వేళల్లో గోదారమ్మకు నక్షత్ర హారతి, నాగహారతి,కుంభ హారతులు నిర్వహించి గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేపట్టారు. వేదమంత్రోచ్ఛారణల మధ్యన పవిత్ర గోదావరి నదికి కన్నుల పండుగగా హారతి నిర్వహిస్తున్న దృశ్యం చూసి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి పోయారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.