మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సోను మండలం సిద్దిలకుంటలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద నీలకంఠ రొయ్య పిల్లలను విడుదల చేశారు.
నిర్మల్‌లో రూ.కోటి రూపాయలతో మత్స్య భవన్, రూ.50 లక్షలతో చేపల మార్కెట్ నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, కలెక్టర్ ప్రశాంతి, మత్స్యకారుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: స్వరూపం మార్చుకోనున్న ప్రజారవాణా