నిర్మల్ జిల్లా ముధోల్లో గత రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై ఆరబెట్టిన సోయా పంట తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట పాడైపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా సోయా విత్తనాలు తడిస్తే మొలకెత్తే స్వభావం ఉంటాయి. మక్కలు కూడా ముక్కిపోతున్నాయి. రైతులకు ఆరబెట్టే తిప్పలు తప్పడం లేదు. ఇలా అనేక రకాలుగా పంటను నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
అకాల వర్షాలతో అన్నదాత విలవిల - Farmers Effected by Premature rains in Nirmal district
అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

అకాల వర్షాలతో అన్నదాత విలవిల
నిర్మల్ జిల్లా ముధోల్లో గత రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై ఆరబెట్టిన సోయా పంట తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట పాడైపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా సోయా విత్తనాలు తడిస్తే మొలకెత్తే స్వభావం ఉంటాయి. మక్కలు కూడా ముక్కిపోతున్నాయి. రైతులకు ఆరబెట్టే తిప్పలు తప్పడం లేదు. ఇలా అనేక రకాలుగా పంటను నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
అకాల వర్షాలతో అన్నదాత విలవిల
అకాల వర్షాలతో అన్నదాత విలవిల
రిపోర్టర్: G.నాగేష్
సెంటర్ : ముధోల్
జిల్లా : నిర్మల్
సెల్.9705960097
======================================= ==================================
నిర్మల్ జిల్లా ముధోల్ లో చేతికొచ్చిన సోయా పంట గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షపు నీటిలో తడిసి రైతులకు తీరని నష్టం కలిగించింది.రాత్రనక, పగలనక నిరంతరం శ్రమించి పండించిన పంట చివరికి నీటి పాలైంది.ఈ సంవత్సరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అధిక విస్తీర్ణంలో సొయా పంటను సాగు చేశారు.పంట విత్తే ముందు సరైన వర్షాలు పడక విత్తనాలు మొలకెత్తక పంట పెట్టుబడి లేక అప్పులు చేసి మరి రెండు నుండి మూడు సార్లు విత్తారు,నిరంతరం కాపలా కాశారు.కోతకు వచ్చే సమయానికి అకాల వర్షం తో చేతికొచ్చిన పంట వర్షపు నీటిలో తడిసి ముద్దైంది.ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు నష్టాల పాలిట శాపంగా మారారు.పంటపై ఆధారపడిన రైతుల జీవితం దుర్భరమైందని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట సాగుకు చేసిన అప్పులు తీర్చక తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం రైతుల కష్టాలను గమనించి వర్షపు నీటిలో తడిసిన పంటకు మద్దతు ధర పలికి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు,పండిన పంట ఎండబెడితే ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దైంది.తడిసిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు