భైంసాలో ఇటీవల జరిగిన ఘటనలో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని కోరుతూ నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్‌ను కలిసి కలెక్టర్ ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు. వారం రోజుల్లోపు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు.
మంత్రి నియోజకవర్గానికి సమీపంలోనే అల్లర్లు చోటు చేసుకున్నా ఇప్పటికీ బాధితులను పరామర్శించకపోవడం విడ్డూరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేకపోవడం విచారకరమని అన్నారు.
నాయకులున్నది రక్షించడానికా.. భక్షించడానికా??
ప్రజాస్వామ్య దేశంలో నాయకులున్నది రక్షించడానికా లేక అందినకాడికి భక్షించడానికా అంటూ భాజపా నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి మండిపడ్డారు. అమాయక ప్రజలను అరెస్ట్ చేస్తూ, వారికి బెయిల్ రాకుండా పోలీసులు అడ్డుపడటం శోచనీయమన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడం సరికాదని తెలిపారు. విషయం బయటకు రాకుండా మీడియా గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నూతన కౌన్సిలర్లు రాజేశ్వర్, కపిల్ షిండే, శాంత, రావుల స్వర్ణ, నర్సుబాయి, గౌతం పింగే, అనితా సూత్రవే, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కలెక్టర్ బదిలీ... ఎంపీడీవో సస్పెన్షన్...