ETV Bharat / state

శ్మశానవాటిక వివాదం.. అంత్యక్రియలను అడ్డుకున్న మాజీ ఎంపీపీ

నిర్మల్ జిల్లా కొత్త పోచంపాడ్​ గ్రామం ఒడ్డెర కాలనీ వద్ద శ్మశానవాటిక స్థలం వివాదాస్పదంగా మారింది. మరణించిన వ్యక్తి అంత్యక్రియలు శ్మశానవాటికగా భావిస్తున్న స్థలంలో నిర్వహించగా జిల్లా మాజీ ఎంపీపీ భర్త అల్లోల గోవర్ధన్​ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు అతని వాహనాన్ని అడ్డుకోగా.. స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

controversial-of-a-new-pochampad-graveyard-in-nirmal-district
శ్మశానవాటిక వివాదం.. అంత్యక్రియలను అడ్డుకున్న మాజీ ఎంపీపీ
author img

By

Published : Nov 9, 2020, 10:44 PM IST

నిర్మల్​ జిల్లా కొత్త పోచంపాడ్ గ్రామంలోని శ్మశానవాటిక స్థలం వివాదాస్పదంగా మారింది. ఒడ్డెర కాలనీలోని ఓ వ్యక్తి మృతి చెందడం వల్ల గ్రామస్థులు అతని అంత్యక్రియల కోసం శ్మశానవాటికగా భావిస్తున్న స్థలంలో మట్టి తవ్వారు. అదే సమయంలో ఆ భూమి తనదని.. దానికి పట్టా కూడా ఉందని నిర్మల్ మాజీ ఎంపీపీ భర్త అల్లోల గోవర్ధన్ రెడ్డి వారిని అడ్డుకున్నారు.

దీంతో ఆగ్రహించిన స్థానికులు గోవర్ధన్​ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. 2014 లోనే తమకు శ్మశానవాటిక కోసం 14 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించిందని.. ఇప్పుడు గోవర్ధన్​ పట్టా తనదనడం ఏంటని తిరగబడ్డారు. తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించిన గోవర్ధన్ రెడ్డి కారు ముందు కూర్చుని ధర్నా చేపట్టారు. దానితో రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతలో పోలీసులు జోక్యం చేసుకోవడం వల్ల వివాదం సద్దుమణిగింది.
ఇదీ చూడండి: కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.