ETV Bharat / state

సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు: కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ

నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జిల్లా పాలనాధికారి ముషర్రఫ్ ఫారూఖీ సమావేశమయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

Collector Musharraf Farooqi met with officials in nirmal district collectorate
సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు: కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ
author img

By

Published : Oct 3, 2020, 6:08 PM IST

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పల్లె ప్రకృతి వనాలు వందశాతం పూర్తైనా సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Collector Musharraf Farooqi met with officials in nirmal district collectorate
కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ

జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన 582 పల్లె ప్రకృతి వనాలను వందశాతం పూర్తి చేసుకోవడం అభినందనీయమని కలెక్టర్​ పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో మిగతా అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను అమలు చేయాలని సూచించారు. అలాగే రైతు వేదికలు, శ్మశాన వాటికల నిర్మాణాలను అధికారులు సమన్వయంతో వేగవంతం చేసి పూర్తి చేయాలని అన్నారు.

రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా అభివృద్ధిలో ముందుండేలా అధికారులు కృషి చేయాలనీ సూచించారు. పల్లె ప్రకృతి వనాలు వందశాతం పూర్తి అయినా సందర్బంగా అధికారులను శాలువాతో సత్కరించి అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.