ETV Bharat / state

పెళ్లి కొడుకు మిస్సింగ్..సినిమా సీన్​ను తలపించిన ఘటన

మంగళ వాయిద్యాలు.. పురోహితుల మంత్రోచ్ఛరణలు.. బంధువుల హంగామాతో వివాహ వేడుక ముచ్చటగా జరుగుతోంది. ఇంతలో పెళ్లి కొడుకు కనిపించట్లేదని ఓ పిలుపు వినబడింది. అందరూ ఏమైంది అని ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా సినిమా సీన్​లా ఉన్నా..రియల్ లైఫ్​లో జరిగింది.

bride-groom-missing-at-mudhol-in-nirmal-district
పెళ్లి కొడుకు మిస్సింగ్​.. సినిమా తరహాలో సంఘటన
author img

By

Published : Jan 29, 2020, 4:12 PM IST

పెళ్లి కొడుకు మిస్సింగ్​.. సినిమా తరహాలో సంఘటన

నిర్మల్​ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో పెళ్లి కొడుకు కనిపించకపోవడం వల్ల ఆ వివాహం ఆగిపోయింది. ముధోల్​కు చెందిన సంతోశ్​కు, లోకేశ్వరం మండలం పొట్ పెల్లికి చెందిన అమ్మాయితో గత నెల క్రితం వివాహం కుదిరింది. ఇవాళ ముధోల్​లోని జీఏం కల్యాణ మండపంలో వివాహం జరగనుండగా.. మంగళవారం రాత్రి నుంచి సంతోష్ కనిపించకుండా పోయాడు.

ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఇల్లరికం వివాహం అయినందునే ఇష్టం లేక పారిపోయి ఉండవచ్చని కుటుంబీకులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: మాయమాటలు చెప్పింది... మాయం చేసింది..!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.