ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ వల్ల పేదల మీద అదనపు భారం : భాజపా నేత రాంనాథ్ - భాజపా ధర్నా

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్​ కార్యాలయం ముందు భాజపా ఆధ్వర్యంలో ఎల్​ఆర్​ఎస్​ రద్దు చేయాలని ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద ప్రజల నడ్డి విరిచి.. కబ్జాకోరులకు మేలు చేసేందుకే.. ఎల్​ఆర్​ఎస్​ తెచ్చారంటూ భాపజా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP Protest Against LRS In Nirmal
ఎల్​ఆర్​ఎస్​ వల్ల పేదల మీద అదనపు భారం : భాజపా నేత రాంనాథ్
author img

By

Published : Sep 29, 2020, 4:44 PM IST

ఎల్​ఆర్​ఎస్​ రద్దు చేయాలంటూ నిర్మల్​ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్​ కార్యాలయం ముందు భాజపా నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా నింపుకోవడం కోసమే ఎల్​ఆర్​ఎస్​ తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల నడ్డి విరిచి.. వారిపై అదనపు భారం మోపేందుకు తెచ్చిన ఎల్​ఆర్​ఎస్​ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని.. భాజపా రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్​ డిమాండ్​ చేశారు.

పైసా పైసా పొదుపు చేసి సొంతింటి కోసం ఫ్లాట్​ కొనుక్కుంటే.. పేదల ఆశ మీద ప్రభుత్వం నీళ్లు చల్లుతుందని ఆరోపించారు. తెరాస నాయకులకు , భూకబ్జాదారులకు లబ్ది పొందేలా ప్రభుత్వ భూములు, లావన్ పట్టా భూములు ఎల్​ఆర్​ఎస్​ పేరుతో అప్పగించేందుకు.. ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్​ను రద్దు చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.