ETV Bharat / state

'పథకం ప్రకారమే భైంసా అల్లర్లు ' - జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే

భైంసా అల్లర్లకు మతం రంగు పులి.. ఘటనను పక్కదారి పట్టించేలా కొంత మంది చూస్తున్నారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే ఆరోపించారు. పథకం ప్రకారమే ఈ అల్లర్లు చేసినట్లు అనుమానం వస్తోందని తెలిపారు.

Bhaimsa Riots As For Plan:NCPCR Member pragna parande
ప్రజ్ఞా పరాండే
author img

By

Published : Feb 11, 2020, 8:46 PM IST

భైంసా అల్లర్లలో నష్టపోయిన బాధిత కుటుంబాల్లో ఇప్పటికీ భయం పోలేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే అన్నారు. భైంసా అల్లర్లకు మతం రంగు పులి.. ఘటనను పక్కదారి పట్టించేలా కొంత మంది చూస్తున్నారని ఆరోపించారు. పథకం ప్రకారమే ఈ అల్లర్లు చేసినట్లు అనుమానం వస్తోందని చెప్పారు.

చిన్నారుల చదువుకు సంబంధించిన ధ్రువపత్రాలు మంటల్లో కాలిపోయాయని... ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు కూడా నిలిచిపోయాని ప్రజ్ఞా పరాండే ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో నెలకొన్న అభద్రతా భావం, భయాందోళన నుంచి బయటపడటానికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

భైంసా అల్లర్లు పురపాలక ఎన్నికల ముందే జరగడం వల్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయని, అక్కడున్న ఇళ్ల స్థలాల కోసం కూడా అల్లర్లను సృష్టించి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరఫున నివేదికను రూపొందించి... కేంద్రానికి సమర్పిస్తానని ప్రజ్ఞా పరాండే తెలిపారు.

ప్రజ్ఞా పరాండే

ఇదీ చూడండి : మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.