ETV Bharat / state

కోప్టా చట్టం నుంచి బీడీ కార్మికులను మినహాయించాలి : ఐఎఫ్​టీయూ - కోప్టా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోప్టా చట్టానికి వ్యతిరేకంగా బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. నిర్మల్​ జిల్లా కుంటాల మండలకేంద్రంలో ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.

beedi workers and iftu dharna on new act kopta in nirmal district in kuntala mandal
కోప్టా చట్టం నుంచి బీడీ కార్మికులను మినహాయించాలి : ఐఎఫ్​టీయూ
author img

By

Published : Mar 5, 2021, 1:47 PM IST

కోప్టా చట్టం నుంచి బీడీ కార్మికులను మినహాయించాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియున్​ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్​ కార్యాలయం వరకు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్​ జిల్లా కుంటాల మండలకేంద్రంలోని మున్నూరు కాపుసంఘం భవనంలో సభ ఏర్పాటు చేశారు.

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాకే కేంద్రం కోప్టా చట్టం అమలు చేయాలని ఐఎఫ్​టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. బహిరంగంగా బీడీలు అమ్మడంపై ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. ఏడేళ్లుగా బీడీలు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త చట్టం వల్ల తమ బతుకులు రోడ్డున పడతాయని వాపోయారు.

ఇదీ చూడండి: క్షణికావేశంలో భర్తపై కర్రతో దాడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.