దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం గోదావరి తీరాన వేద భారతి పీఠం ఆధ్వర్యంలో గంగా జాతర మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు. ఋషి కుమారులు అమ్మవారికి అభిషేకం అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. మహా దేవునికి రుద్రాభిషేకం నిర్వహించి రిషి పుత్రులు, వేద మంత్రోచ్ఛారణలతో రుద్రయాగం చేశారు. అనంతరం వేద విద్యా నందగిరి స్వాములు చిన్నారులకు నోట్ బుక్లు, పెన్నులు ప్రసాదం రూపంలో అందించారు.
బాసరలో ఘనంగా గంగా జాతర మహోత్సవం - basara
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని గోదావరి నది తీరాన గంగా జాతర మహోత్సవం వైభవంగా జరిగింది.