మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. గేటు ఎత్తడంతో నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలోకి నీరు వచ్చి చేరుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏటా మార్చి 1న... 0.6 టీఎంసీల విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా జులై 1న గేట్లను ఎత్తి... అక్టోబర్ 28న మూసివేయాలి.
కేంద్ర జల సంఘం అధికారుల సమక్షంలో... ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అధికారులతో పాటు.. ఏస్సారెస్పీ అధికారులు పాల్గొంటారు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో 0.97టీఎంసీల నీరు ఉండగా... 0. 6 టీఎంసీల నీళ్లు దిగువకు వదులుతున్నారు.
ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లికి నిరాకరణ- జైల్లోనే తాళి కట్టించిన అధికారులు