నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐఎఫ్టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు, కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ నుంచి మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకూ ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్మికులను బానిసత్వంలోకి నెట్టే కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, కార్మికులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు బక్కన్న, రాం లక్ష్మన్, గంగన్న, శ్రీనివాసచారి, జీఎస్ నారాయణ, భీంరెడ్డి, రాజేశ్వర్, కిషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: ఏడేళ్లు ప్రేమించుకున్నారు... పెళ్లి అనగానే చితకబాదారు!