పల్లెప్రగతి పనుల్లో వేగం పెంచాలని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్మశాన వాటికలు, పంట కల్లాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకు ప్రభుత్వం 2510 కల్లాలను కేటాయించిందని...ఇప్పటికే 810 చోట్ల నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.
పనుల్లో పురోగతిపై అధికారులు ప్రతిరోజు పర్యవేక్షించాలని తెలిపారు. శ్మశానవాటికల్లో ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని వెల్లడించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు పాలనాధికారి హేమంత్ బోర్కడే, జిల్లా పంచాయతీరాజ్‌శాఖ, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.