ఉపాధి పనుల్లో విషాదం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా పెద్ద జట్రం గ్రామంలో శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పనుల్లో భాగంగా మట్టిని ఎత్తుతుండగా నర్సింగమ్మ(47)కు ట్రాక్టర్ వెనుక భాగం తగిలింది. గాయపడిన ఆమెను అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
సమాచారం తెలుసుకున్న డీఆర్డీఓ కాళాందిని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. రెండు లక్షల రూపాయలు అందిస్తామని తెలిపారు. మృతురాలి భర్త హనుమంతుకు తక్షణం రూ. 50 వేల రూపాయల చెక్‌ను అందించారు.
ఇదీ చూడండి : 'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం'