నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ అధికారులు కంది కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల రైతులు ఆందోళనకు దిగారు. తమకు టోకెన్లు ఇచ్చి కొనుగోలు సెంటర్లు ఎలా బంద్ చేస్తారని అధికారులను నిలదీశారు. రైతులు తీసుకువచ్చిన పంటనంతా కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
12 శాతం తేమ ఉన్న కందులను మాత్రమే కొనుగోలు చేస్తామని, రైతులు పచ్చి కందులు తీసుకువస్తున్నారని అధికారులు అంటున్నారు. అందుకే కొనుగోలు సెంటర్లు బంద్ చేశామని తెలిపారు.
సుమారు రెండు గంటలపాటు రైతులు రాస్తారోకో చేయడం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సర్దిచెప్పినా... రైతులు వెనక్కి తగ్గలేదు. టోకెన్లు ఇచ్చిన రైతుల పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా... కర్షకులు ఆందోళన విరమించారు.
- ఇదీ చూడండి : కేంద్రంపై పోరుకు కాంగ్రెస్ సమాయత్తం!