నారాయణపేట జిల్లాలోని మండపేట వ్యవసాయ మార్కెట్లో అధికారులు కంది కొనుగోళ్లు నిలిపివేశారని రైతులు ఆందోళనకు దిగారు. మార్క్ఫెడ్ అధికారులు టోకెన్లు ఇచ్చిన తర్వాత కొనుగోలు సెంటర్లు బంద్ చేశారని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణపేట-హైదరాబాద్ రోడ్డుపై రాస్తారోకో చేయడం వల్ల రవాణా ఎక్కడికక్కడే స్తంభించింది. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా... రైతులు కదలకుండా భీష్మించుకు కూర్చున్నారు. తమ వద్ద నుంచి కందులు కొనుగోలు చేసే వరకు ఆందోళన విరమించేదిలేదని తేల్చిచెప్పారు.