ETV Bharat / state

ప్రారంభానికి ముందే శిథిలావస్థకు పంచాయతీ భవనం - CRACKS

గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న పంచాయతీ భవనాలు అధికారుల పర్యవేక్షణాలోపానికి అద్దం పడుతున్నాయి. ప్రారంభానికి ముందే గోడలు బీటలువారి పడిపోయే పరిస్థితికొస్తున్నాయి.

NEW GRAMA PANCHAYAT BUILDING GET CRACKS
author img

By

Published : Jun 26, 2019, 12:05 AM IST

నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని చిన్నపొర్లలో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనం ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంది. రూ.10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పంచాయతీ భవనం ఓవైపు పూర్తికావొస్తుండగా... మరోవైపు గోడలు బీటలు వారి పడిపోయే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేపట్టి చేతులెత్తేస్తున్నారు. ఇదేకాక భవనాన్ని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు కూడా వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేసి గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

ప్రారంభానికి ముందే శిథిలావస్థకు పంచాయతీ భవనం

ఇవీ చూడండి: ప్రభుత్వాధికారిపై చెప్పుతో దాడిచేసిన మహిళా రైతు

Intro:Tg_mbnr_11_25_grama_panchayithi_av_C12
ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకున్నా గ్రామ పంచాయతీ భవనం.

Body:నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని చిన్నపొర్లలో రూపాయలు 10 లక్షల వ్యయంతో పంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టారు. పనులు పూర్తి అవుతున్న క్రమంలో ప్రారంభోత్సవం కాకముందే గోడలు బీటలు వారి పడిపోయే పరిస్థితి నెలకొంది ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇష్టానుసారంగా పనులు చేపట్టి చేతులెత్తేస్తున్నారు. శిథిలావస్థకు చేరుతున్న క్రమంలో గ్రామంలోని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు వాడుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు.

Conclusion:అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే మరమ్మతులు చేయించి గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.