ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరదనీరు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గోప్లాపూర్ గ్రామంలోని భీమా ఇరిగేషన్ ప్రాజెక్టుకు చేరింది. దీంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి భీమా స్టేజ్ ఫేస్-2 పంపు హౌస్ మోటారు స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలోపాటు స్థానిక సర్పంచ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బాసరలో కళతప్పిన గురు పౌర్ణమి ఉత్సవాలు