ETV Bharat / state

ఆశావర్కర్లకు నిత్యావసరాల పంపిణీ - నిత్యావసరాల పంపిణీ

నారాయణపేట జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో స్మైల్​ ఫౌండేషన్​, ఆశాజ్యోతి హైదరాబాద్​ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ హరిచందన చేతుల మీదుగా ఆశా వర్కర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆశాజ్యోతి ఫౌండేషన్​ సభ్యులు 200 మంది కలిసి విరాళాలు వసూలు చేసి పంచుతున్నారు.

Groceries Distribution For Aasha Workers
ఆశావర్కర్లకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 23, 2020, 8:55 PM IST

నారాయణపేట జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్మైల్​ ఫౌండేషన్​, ఆశాజ్యోతి ఫౌండేషన్​లు కలిసి ఆశా వర్కర్లకు కలెక్టర్​ హరిచందన చేతుల మీదుగా నిత్యావసరాలు అందించారు. 200 మంది ఆశాజ్యోతి సభ్యులు బృందంగా ఏర్పడి విరాళాలు వసూలు చేసి మురికి వాడల్లో ఉండేవారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.

కరోనా నివారణకు ఇంటింటికీ తిరుగుతూ వైద్య పరీక్షలు చేస్తున్న ఆశా వర్కర్లకు నిత్యావసరాలు అందించి వారి పట్ల కృతజ్ఞత ప్రదర్శించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. 6,700 నెలసరి ప్యాడ్స్​, 400 ప్యాకెట్ల నిత్యావసర సరుకులు పంచినట్లు స్మైల్​ ఫౌండేషన్​, ఆశాజ్యోతి ఫౌండేషన్​ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.