ETV Bharat / state

సీతాఫలాలు అమ్మడం కంటే ఇలా చేస్తేనే లాభం...!!

శీతాకాలం సమీపిస్తోంది. నోరూరించే సీతాఫలాలు వచ్చేశాయి. చెట్టూ, పుట్టా, కొండ, గుట్టలు తిరిగి రైతులు వాటిని సేకరిస్తారు. అలా తెచ్చిన ఫలాల్ని పదో పరక్కో అమ్మి పూట గడుపుకుంటారు. అలాకాకుండా సీజన్​లోనే ఆ పండ్లను సేకరించి... గుజ్జు తీసి... శుద్ధిచేసి నాణ్యమైన సరుకుగా మార్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఇలా సెర్ఫ్​ సంస్థ ఆహారశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కలిపిస్తోంది. అదేంటో మనమూ చూద్దాం.

author img

By

Published : Oct 26, 2019, 6:41 AM IST

ఇలా చేస్తేనే లాభం...!!
సీతాఫలాలు అమ్మడం కంటే ఇలా చేస్తేనే లాభం...!!

ఖరీఫ్​ ముగిసి... శీతాకాలం సమీపిస్తున్న వేళ... సీతాఫలాల రాక మొదలవుతుంది. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలోని పలు మండలాల్లో ఈ ఫలాలు విరివిగా లభిస్తాయి. రైతులు, కూలీలు వీటిని సేకరించి పట్టణాలకో, జాతీయ రహదారుల వెంబడో అమ్ముకుని ఆదాయం పొందుతుంటారు.

గ్రేడుల వారీగా ధరలు...

సీతాఫలాలకు గ్రేడుల వారిగా ధరలు కేటాయించారు. ఏ గ్రేడ్​ కాయలకు కిలో12రూపాయలు, బీ గ్రేడ్​కు 10రూపాయలు, సీగ్రేడ్​కు 8 రూపాయలు రైతులకు చెల్లిస్తారు. కిలోకు 80పైసలు ఆ సంఘానికి కమిషన్​ రూపంలో చెల్లిస్తారు.

22 డిగ్రీల సెల్సియస్​ వద్ద శీతలీకరణ

గ్రామస్థాయి సేకరణ కేంద్రాల నుంచి కాయల్ని ప్రాసెసింగ్​ యూనిట్లకు తరలిస్తారు. అక్కడ రెండు రోజులు మాగబెట్టి పండ్లుగా మార్చుతారు. పండ్ల నుంచి తొక్కను, గుజ్జును వేరుచేస్తారు. గుజ్జులోంచి విత్తనాన్ని వేరు చేస్తారు. నాణ్యమైన గుజ్జు కిలోకు 10గ్రాముల చొప్పున చక్కెరపొడి కలిపి ప్యాకెట్లలో కిలో చొప్పున ప్యాక్ చేస్తారు. ప్యాకెట్ లోపల గాలి లేకుండా తీసివేసి... మైనస్ 22 డిగ్రీల సెల్సియస్ వద్ద శీతలీకరిస్తారు.

ఐస్​ క్రీం కంపెనీలకు విక్రయం

ఆహారశుద్ధి కేంద్రాల్లో తయారైన సీతాఫలాల గుజ్జును సెర్ఫ్​... ముందుగానే అవగాహన ఒప్పందం చేసుకున్న ఐస్ క్రీం కంపెనీలకు నేరుగా విక్రయిస్తోంది. చేతితో తీసిన గుజ్టును కిలో 225, యంత్రాల ద్వారా తీసిన గుజ్జును కిలో 180కి అమ్ముతున్నారు. ఇక తీసేసిన తొక్క, చెడిపోయిన పళ్లను వర్మీకంపోస్ట్ ఎరువుల తయారీకి, విత్తనాలను భద్రపరచి కిలో 180 రూపాయలకు విక్రయిస్తున్నారు. సీతాఫలం తొక్క, గుజ్జు, విత్తనం మూడింటి ద్వారా ఆదాయం పొందుతున్నారు.

అందరికీ లాభమే

గత ఏడాది దామరగిద్ద ప్రాసెసింగ్ యూనిట్​లో 13 టన్నుల సేకరణే లక్ష్యంగా కొనుగోలు చేశారు. గుజ్టు తయారీ, కూలీలు, ఇతర ఖర్చులు పోనూ మహిళ సంఘానికి 2లక్షల ఆదాయం చేకూరింది. ఈసారి 3 కేంద్రాలకు 100 టన్నుల సీతాఫలాల కొనుగోలుకు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 25 టన్నులు కొనుగోలు చేశారు. గతేడాది కంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గతేడాది దామరగిద్దలో ఎరువుకు 32 వేల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: పడిలేచిన 'మహా' కెరటం పవార్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.