ETV Bharat / state

కొవిడ్​ టీకా వేయించుకున్న జిల్లా కలెక్టర్​ - నారాయణ్​పెట్​ జిల్లాలో కరోనా టీకా కార్యక్రమం

అపోహలను వీడి ప్రజంలతా కొవిడ్​ వ్యాక్సిన్ వేయించుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. టీకా పట్ల ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్​ వేయించుకున్నారు.

covid vaccinated NarayanPet Collector
కొవిడ్​ టీకా వేయించుకున్న జిల్లా కలెక్టర్​
author img

By

Published : Mar 19, 2021, 7:00 PM IST

ప్రజలంతా అపోహలు వీడి కొవిడ్​ టీకా వేయించుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్​ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్​ ప్రజల్లో టీకా పట్ల ఉన్న భయాలు పోగొట్టేందుకే తాను వ్యాక్సిన్​ వేయించుకున్నానని తెలిపారు.

జిల్లాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా.. 45 నుంచి 60 ఏళ్ల మధ్య గల ప్రజలు కొవిడ్​ టీకా వేయించుకుంటున్నారని కలెక్టర్​ హరిచందన తెలిపారు. టీకా పట్ల ప్రజల్లో ఉన్న భయాలను తొలగించడం కోసం తాను వ్యాక్సిన్ వేయించుకున్నానన్నారు. వ్యాక్సినేషన్​ కార్యక్రమంతో కరోనా​ మహమ్మారిని అంతమొందించడంలో చివరి దశకు చేరుకున్నామని పేర్కొన్నారు. టీకా వేయించుకున్నప్పటికీ మాస్క్​ ధరిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 75 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.