ETV Bharat / state

స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం.. పొలంలో గుడారం వేసుకుని జీవనం

అసలే కరోనా మహమ్మారి.. క్వారంటైన్ పేరు చెబితే చాలు ప్రజలు హడలెత్తిపోతున్నారు. దేశవిదేశాల నుంచి తరలివచ్చినా పరీక్షలు చేయించుకునేందుకు వెనకంజ వేస్తున్నారు. తోటి సమాజంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. వైద్యులపై దాడులు చేసేవారు కూడా ఉన్నారు. అయితే వీరందరికీ భిన్నంగా స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటిస్తుంది నారాయణపేట జిల్లాలోని ఓ కుటుంబం.

స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం.. పొలంలో గుడారం వేసుకుని జీవనం
స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం.. పొలంలో గుడారం వేసుకుని జీవనం
author img

By

Published : Apr 5, 2020, 3:30 PM IST

స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం.. పొలంలో గుడారం వేసుకుని జీవనం

నారాయణపేట జిల్లా మాగనూరు మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన కురువ హనుమంతు కుటుంబం పెద్ద మనసుతో ఆలోచించింది. తమ వల్ల తమ గ్రామానికి, ప్రజలకు ఎలాంటి సమస్య రాకూడదని బెంగళూరు నుంచి వలస రావడంతోనే ఊరికి దూరంగా తమ సొంత పొలంలో గుడారం వేసుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సుమారు నాలుగు రోజుల కిందట వలస వచ్చారు.

అధికారుల అభినందనలు:

ఈ విషయం తెలుసుకున్న అధికారులు కురువ హనుమంతు కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. వెంటనే వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించి నిత్యావసరాలకు లోటు రాకుండా చూసుకుంటున్నారు. నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కురువ హనుమంతు కుటుంబాన్ని ఆదర్శంగా ప్రతి ఒక్కరూ తీసుకుని స్వీయ నిర్బంధంలో ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: మాస్కు​ ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.