ETV Bharat / state

గొంతులో పల్లీ ఇరుక్కుని పదకొండు నెలల చిన్నారి మృతి

వేరుశనగ గింజ గొంతులో ఇరుక్కుని పదకొండు నెలల బాలిక మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్​ గ్రామంలో జరిగింది. నాలుగు రోజుల క్రితం ఘటన జరగగా హైదరాబాద్​ నిలోఫర్​లో చికిత్స పొందుతున్న చిన్నారి గురువారం చనిపోయింది.

11 month baby died as groundnut struck in her throat at narayanpet
గొంతులో పల్లీ ఇరుక్కుని పదకొండు నెలల చిన్నారి మృతి
author img

By

Published : Sep 24, 2020, 8:01 PM IST

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్​ గ్రామానికి చెందిన ప్రణీత.. ఈ నెల 19న సాయంత్రం పల్లీలు తినగా.. ప్రమాదవశాత్తు.. పాప గొంతులో ఇరుక్కున్నాయి. ఒక గింజ ఊపిరితిత్తుల్లోకి వెళ్లగా వెంటనే హైదరాబాద్​లోని నిలోఫర్​ ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.

అయితే గురువారం మధ్యాహ్నం.. చిన్నారి మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: 'రైతుల తర్వాత ఈసారి కార్మికులపై దోపిడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.