ETV Bharat / state

ys Sharmila: ఇవాళ నల్గొండలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష - వైఎస్​ఆర్​టీపీ వార్తలు

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్​. షర్మిల(ys Sharmila) నేడు నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం-నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ysrtp-president-ys-sharmila-hunger-strike-at-nalgonda-district-headquarters

author img

By

Published : Oct 12, 2021, 5:23 AM IST

Updated : Oct 12, 2021, 6:27 AM IST

నల్గొండ జిల్లా (Nalgonda) కేంద్రంలోని క్లాక్​టవర్​ వద్ద వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల.. నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టనున్నారు (Sharmila unemployment hunger strike). ఈ సందర్భంగా జిల్లాకు చెందిన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం(mahatma Gandhi university) వద్ద మాట్లాడిన అనంతరం ... నిరాహారదీక్ష వేదికకు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతి మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష వారం చేపడతానని షర్మిల (ys Sharmila) వనపర్తి జిల్లా తాడిపత్రి పర్యటనలో చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ పర్యటనలో తెలిపారు. వాటిని భర్తీ చేయాలనే డిమాండ్​తో ప్రతివారం ఒక్కో జిల్లాలో దీక్ష చేపడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ దీక్ష చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ వారం నల్గొండ కేంద్రంలో దీక్ష చేస్తున్నారు.

ఇదీ చూడండి: Huzurabad Election: ఎన్నికల అధికారి తీరుపై సందేహం.. కేసీఆర్​తో...: వైఎస్​ షర్మిల

Last Updated : Oct 12, 2021, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.