నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ పంచాయతీ కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనపై కక్ష గట్టి సస్పెండ్ చేయించాడని మల్లమ్మ ఆరోపించింది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల సర్పంచ్ మల్లమ్మను కలెక్టర్ సస్పెండ్ చేయగా... వార్డు సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు. నిరసనలో భాగంగా.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వార్డు సభ్యులు అడ్డుకుని... ఆస్పత్రికి తరలించారు.
కంపెనీల నుంచి డబ్బు వసూలు చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారంటూ... సర్పంచ్ ఆరోపించారు. డబ్బు వసూలు చేయలేదనే సస్పెండ్ చేయించారని మల్లమ్మ ఆక్షేపించారు.