ETV Bharat / state

లారీని ఢీకొన్న అంబులెన్స్​... ఇద్దరు మృతి - accident and death news

ఆరోగ్యం సరిగా లేదని... మెరుగైన చికిత్స తీసుకునేందుకు ఏపీ నుంచి హైదరబాద్​ బయలుదేరాడు ఓ వ్యక్తి. అతనికి తోడుగా కుమారుడిని సైతం తీసుకుని అంబులెన్స్​లో నగరానికి పయనమయ్యాడు. ఆరోగ్యం కుదుటపడితే ఇంటికి వద్దామనుకున్న వారిని మృత్యువు వెంటాడింది. అంబులెన్స్​ డ్రైవర్​ నిర్లక్ష్యంతో ఆ తండ్రి కొడుకు ప్రాణాలు విడిచిన ఘటన నల్గొండలో చోటు చేసుకుంది.

two-members-died-in-accident-at-nalgonda
లారీని ఢీకొన్న అంబులెన్స్​... ఇద్దరు మృతి
author img

By

Published : Aug 19, 2020, 10:36 AM IST

Updated : Aug 19, 2020, 11:35 AM IST

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్ ఫ్లైఓవర్ వద్ద విషాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా... డైవర్​కు తీవ్రగాయాలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరుకు చెందిన వ్యాధిగ్రస్తుడిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 'కనులు కనులను దోచాయంటే' నిర్మాతల్లో ఒకరైన నందగోపాల్‌రెడ్డి(75) ఆరోగ్యం సరిగా లేకపోవడంతో... అతని కుమారుడు కమలాకర్‌రెడ్డిని తోడుగా తీసుకుని అంబులెన్స్​లో హైదరాబాద్‌కు బయల్దేరారు.

వేగంగా వచ్చిన అంబులెన్స్​ కొండ్రపోల్‌ ఫ్లైఓవర్ వద్ద... ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో... గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: గోదారమ్మ శాంతించింది... చేసిన నష్టం సవాలుగా మారింది

Last Updated : Aug 19, 2020, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.