నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి దేవరకొండ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం వరకు కార్మికులు డిపో ముందు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొన్నాడు. ఇంటికి వెళ్లిన జైపాల్‌రెడ్డికి రాత్రి గుండెపోటు రావడం వల్ల కుటుంబ సభ్యులు దేవరకండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహంతో దేవరకొండ డిపో ముందు కుటుంబ సభ్యులు,కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే పీఏ గల్లంతు... పోలీసుల వెతుకులాట!