లాక్డౌన్ కారణంగా సొంత ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న వలస కార్మికులను తరలించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున బస్సు సౌకర్యం కల్పించినట్లు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల కోసం బస్సు ఏర్పాటు చేశారు. కార్మికులు వెళ్తున్న బస్సును ఉత్తమ్‌కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపుపై కార్మికుల కోసం బస్సును ఏర్పాటు చేశామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉత్తమ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?: హైకోర్టు