ETV Bharat / state

ఈ పంతులు ఒక్కరోజూ బడికి సెలవు పెట్టలే - teacher

ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వం పాఠశాలలు అంటే అందరికి చులకన భావం ఉంటుంది. అలాంటి బడుల్లో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఎప్పుడు సెలవులు వస్తాయాని ఆలోచించే వారున్న ఈరోజుల్లో... విద్యార్థులకు విద్యపై మక్కువ పెంచుతూ పనిచేస్తున్న ఆదర్శ ఉపాధ్యాయుడు గోరంట్ల ఆనంద్‌పై ఈటీవీ భారత్​ ప్రత్యేకథనం.

గోరంట్ల ఆనంద్‌
author img

By

Published : Sep 5, 2019, 7:36 PM IST

ఈ పంతులు ఒక్కరోజూ బడికి సెలవు పెట్టలే

నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కొరటికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా గోరంట్ల ఆనంద్‌ పనిచేస్తున్నారు. ఈయన 2003 నుంచి 2008 వరకు నల్లగొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు.. అదే సమయంలో 2008లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. ఉద్యోగం వచ్చిన తరువాత దామెరలోని పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విద్యాబోధన ప్రారంభించాడు. తాను పనిచేస్తున్న సమయంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పాఠశాలకు వచ్చేవారని సహచరులు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

నేరుగా ఇంటికే

పాఠశాలలకు ఎవరైన విద్యార్థులు రాకపోతే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యా ప్రాముఖ్యతను వివరించి... వారు పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేసే వారని తోటి ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ పంతులుకు గ్రామస్థులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఇటీవల కాలంలో జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఆయనను సన్మానించారు.ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు.. తమ ఉపాధ్యాయుడిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తే సర్కార్‌ బడులుపై సమాజంలో మంచి అభిప్రాయం ఉంటుందని విద్యార్థులు, ఉపాధ్యాయుల కోరుతున్నారు.

ఇవీ చూడండి : లక్షల్లో లావాదేవీలు... కోట్లలో స్వాహా

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.