నాగార్జునసాగర్ జలాశయం దిగువనున్న శివాలయం గర్భగుడిలోకి వరద నీరు చేరింది. ఈరోజు దాదాపు 7 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడం వల్ల క్రస్ట్ గేట్ల దిగువన ఉన్న ఆలయం వరదతో నిండిపోయింది. ఈనెల 12న సాగర్ క్రస్ట్ గేట్లు తెరవడం వల్ల పుష్కర ఘాట్ల వద్ద స్నానానికి వెళ్లిన జహీరాబాద్‌కు చెందిన వ్యక్తి కొట్టుకుపోవడం వల్ల ఆరోజు నుంచి పుష్కర ఘాట్ మూసివేశారు. నేటికి ఆలయం, పుష్కరఘాట్‌లోకి పర్యటకులను పోలీసులు అనుమతించడం లేదు. 2009లో ఆలయం పూర్తిగా మునిగిపోయింది. మళ్లీ ఈరోజు గర్భగుడిలోకి నీరు చేరుకుంది.
ఇదీ చూడండి: స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం