ETV Bharat / state

జేఈఈ పరీక్ష రాస్తున్నారా? - ఐతే ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

జేఈఈ పరీక్ష రాసే విద్యార్థులకు కేంద్రం శుభవార్త - ఇప్పటినుంచి వరుసగా మూడేళ్లు ఈ పరీక్ష రాసుకోవచ్చని ప్రకటన - 2023 మార్చిలో ఇంటర్‌ ఉత్తీర్ణులకూ ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం

JEE Advanced Exams
JEE Advanced Exams For Three Times (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 8:18 AM IST

JEE Advanced Exams For Three Times : ఐఐటీల్లో బీటెక్ సీట్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షను ఇప్పటి వరకు వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే అవకాశం ఉండగా ఇప్పటి నుంచి మూడేళ్లు రాసుకోవచ్చని కేంద్రం తెలిపింది. దీంతో 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ పాసైన వారికి కూడా ఈసారి ఈ పరీక్ష రాసేందుకు వీలు ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌- 2025 నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పుర్‌ ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది.

2000 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే 2025 అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల మినహాయింపు కూడా ఇచ్చినట్లు తెలిపింది. ఈ వర్గాల్లో 1995 అక్టోబరు 1వ తేదీ లేదా ఆ తర్వాత పుట్టిన వారు కూడా ఈ పరీక్ష రాసుకోవచ్చని వెల్లడించింది. సిలబస్‌లో ఎటువంటి మార్పు లేదని, జేఈఈ మెయిన్‌లో స్కోర్‌ సాధించిన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసుకోవచ్చని ఐఐటీ కాన్పుర్‌ వివరించింది. మే మూడు లేదా నాలుగో వారంలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

జేఈఈ మెయిన్స్​కు ప్రిపేర్ అవుతున్నారా? ఆ విషయంలో మీకో గుడ్​ న్యూస్!

ఒలింపియాడ్‌లో పాల్గొంటే ఐఐటీ కాన్పుర్‌లో సీట్లు : అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో సంబంధం లేకుండా ఐఐటీ కాన్పుర్‌లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌) సీట్లు ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. గణితం, ఇన్‌ఫర్మేటిక్స్‌ ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారికి సీఎస్‌ఈలో ఆరు సీట్లు కేటాయిస్తామని వెల్లడించింది. కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌ సైన్సెస్, మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, బయలాజికల్‌ సైన్సెస్‌ అండ్‌ బయో ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ సీట్లు కేటాయిస్తామని తెలిపింది.

ఈ సీట్లకు మార్చి మొదటి వారంలో దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. జోసా కౌన్సెలింగ్‌ కంటే ముందుగానే ఈ ప్రవేశాలను పూర్తి చేస్తారు. ఇప్పటికే ఉన్న సీట్ల నుంచే ఒలింపియాడ్‌ విద్యార్థులకు కేటాయిస్తారా? సూపర్‌ న్యూమరరీ కింద అదనపు సీట్లు మంజూరు చేస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

జేఈఈ షెడ్యూల్ వచ్చేసింది - పరీక్షలు సహా ఫలితాల తేదీలు​ ఎప్పుడెప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.