ETV Bharat / entertainment

ఇది 'పుష్ప' రూలింగ్- రిలీజ్​కు ముందే మరో రికార్డ్ బ్రేక్ - PUSHPA 2 OVERSEAS BOOKING

ప్రీ బుకింగ్స్​లో 'పుష్ప' జోరు- సొంత రికార్డ్​ను బ్రేక్ చేసిన బన్నీ!

Pushpa The Rule
Pushpa The Rule (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 9:03 AM IST

Pushpa 2 Overseas Booking : ఐకాన్​స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్దీ ఫ్యాన్స్​లో ఉత్కంఠ పెరిగిపోతోంది. మరో 30 రోజుల్లో థియేటర్లలో 'పుష్ప' రూల్ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని సినీవర్గాల టాక్. ఈ నేపథ్యంలో రిలీజ్​కు ముందే 'పుష్ప పార్ట్​ 1' రికార్డును పార్ట్ 2 తాజాగా బ్రేక్ చేసింది.

ఈ సినిమా ఓవర్సీస్​ బుకింగ్స్​లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా నార్త్​ అమెరికాలో ప్రీ బుకింగ్స్​లో భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. మంగళవారం (05/11) నాటికి 'పుష్ప 2', ప్రీ బుకింగ్స్​ ద్వారా 4లక్షల డాలర్లు వసూల్ చేసింది. మొత్తం 2750 షోలకు గాను, దాదాపు 15వేల టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్​కు ఇంకా 30 రోజుల సమయం ఉండడం వల్ల సేల్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక కెనడాలో ఈ సినిమా బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు.

రికార్డ్ బ్రేక్
కాగా, ఇదే నార్త్​ అమెరికాలో 'పుష్ప పార్ట్ 1' లాంగ్​ రన్​లో మొత్తం 4లక్షల డాలర్లు వసూల్ చేసింది. తాజాగా 'పుష్ప ది రూల్' ఈ సంఖ్యను దాటేసింది. రిలీజ్​కు నెల రోజుల సమయం ఉండగానే పార్ట్ 1 ఓవర్సీస్ కలెక్షన్ల రికార్డ్ బ్రేక్ చేసింది.

పుష్ప vs పుష్ప
పుష్ప పార్ట్ 2పై డైరెక్టర్ సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పుష్ప పార్ట్ 1 కంటే సీక్వెల్​లో చాలా మంచి సీన్స్​ ఉంటాయని ఆయన అన్నారు. ప్రేక్షకులకు ఇది పుష్ప వర్సెస్ పుష్పలాగ అనిపిస్తుందని పేర్కొన్నారు. అలాగే పుష్ప రాజ్ - బన్వర్ సింగ్ మధ్య సీన్స్ నెక్ట్స్ లెవెల్​లో ఉంటాయని సుకుమార్ సినిమాపై హైప్ పెంచేశారు. ​

కాగా, డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్​గా నటిస్తుండగా, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు చాట్ బస్టర్ అయ్యాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్​వైడ్ గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

TFIలోనే తొలి సినిమాగా రికార్డ్- ఇదీ 'పుష్ప రాజ్​' బ్రాండూ!

'పుష్ప 2'లో శ్రీలీల! - ఆ స్పెషల్​ సాంగ్ కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.