ETV Bharat / state

మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్ - పిఠాపురంలో మరో 12 ఎకరాల భూమి కొనుగోలు - PAWAN KALYAN BUYS LAND PITHAPURAM

పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ - గతంలో కొన్నచోటే ఈ భూమిని కొనుగోలు చేసిన పవన్ - పిఠాపురం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్

AP Deputy CM Pawan Kalyan Buys Land in Pithapuram
AP Deputy CM Pawan Kalyan Buys Land in Pithapuram (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 7:25 AM IST

Updated : Nov 6, 2024, 8:10 AM IST

AP Deputy CM Pawan Kalyan Buys Land in Pithapuram : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ తన నియోజకవర్గం పిఠాపురంలో మళ్లీ భూమిని కొనుగోలు చేశారు. ఈసారి 12 ఎకరాల భూమిని కొన్నారు. దీని రిజిస్ట్రేషన్​ను ఆయన తరఫున ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్​ ఛైర్మన్​ తోట సుధీర్​ మంగళవారం పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు సమాచారం.

ఎన్నికలకు ముందు పవన్​ కల్యాణ్​ పిఠాపురం ప్రజలకు ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని మాటిచ్చారు. అందులో భాగంగానే జులైలో మండలంలోని భోగాపురం రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 2.08 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈనెల 4వ తేదీన పిఠాపురం పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్​ గతంలోనే కొన్న చోటే మరోసారి ఈ భూమిని కొనుగోలు చేశారు.

'అయ్యా పవన్​ కల్యాణ్​ సార్ - మీరే మాకు న్యాయం చేయాలి - మీ ఒక్కరి వల్లే అవుతుంది'

గతంలో 3.5 ఎకరాలు కొనుగోలు : గతంలోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ పిఠాపురంలో 3.5 ఎకరాల స్థలం కొన్నారు. ఆ భూమి పవన్​ పేరు మీద రిజిస్టర్​ అయింది. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు కార్యాలయం, మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని ఆయన ప్లాన్​ చేశారు. పవన్​ కల్యాణ్ భూమి కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం సుమారు రూ.16 లక్షలు పై చిలుకు పలుకుతోంది. ఇప్పుడు మరో 12 ఎకరాల భూమి కొనుగోలు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన​పై పడింది. ఎందుకు ఇలా భూమిని కొనుగోలు చేస్తున్నారు? అసలు అక్కడ ఏం నిర్మిస్తారు? అని అందరిలో చర్చ నడుస్తోంది.

పిఠాపురం ఎమ్మెల్యేగా బరిలో నిలిచినప్పుడు పిఠాపురం బాధ్యత నాది అని అనాడు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడి ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేసేందుకు అక్కడే మకాం ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ మూడుసార్లు పిఠాపురంలో పర్యటించారు. అక్కడ ఏ సమస్య ఉన్న నేనున్నానంటూ వారికి అండగా నిలుస్తున్నారు.

అన్నప్రాసన రోజు కత్తి పట్టుకున్నాడు - నేడు డిప్యూటీ సీఎం - పవన్​కల్యాణ్ గురించి తల్లి అంజనాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు! - Pawan Mother Interesting Comments

Last Updated : Nov 6, 2024, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.