ETV Bharat / technology

మీ మొబైల్​ ఇంటర్నెట్​ స్లోగా ఉందా? ఈ సింపుల్ టిప్స్​తో స్పీడ్​ పెంచుకోండిలా! - HOW TO INCREASE INTERNET SPEED

మీ ఫోన్​ ఇంటర్నెట్​ చాలా స్లోగా ఉందా? ఈ సీక్రెట్ సెట్టింగ్స్​ మార్చుకుంటే చాలు - డేటా స్పీడ్ పెరగడం గ్యారెంటీ!

Ways to Boost Your data speed
How to Increase Internet Speed (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 5:53 PM IST

How To Increase Internet Speed : ప్రస్తుతం దేశంలో 5జీ సర్వీసులు బాగా అందుబాటులోకి వచ్చాయి. దీనితో అందరూ 5జీ స్పీడ్​తో ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇలా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు అలవాటుపడిన వాళ్లు నెట్ స్లో అయితే తట్టుకోలేరు. మరి మీకు కూడా ఇలాంటి సమస్యే ఎదురవుతోందా? డోంట్ వర్రీ. చాలా సింపుల్​గా మీ నెట్ స్పీడ్​ను పెంచుకునే టాప్​-9 టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. రీస్టార్ట్ ఫోన్ :​ కొన్నిసార్లు అనుకోకుండా ఇంటర్నెట్ స్పీడ్​ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్​గా మీ ఫోన్​ను రీస్టార్ట్ చేయండి. దీని వల్ల ఫోన్​లోని చాలా ప్రోబ్లమ్స్​ ఫిక్స్ అయిపోతాయి. పైగా ఇంటర్నెట్ స్పీడ్​ కూడా పెరుగుతుంది.
  2. క్లోజ్ బ్యాక్​గ్రౌండ్ యాప్స్​ : మన ఫోన్​లో చాలా యాప్స్​ బ్యాక్​గ్రౌండ్​లో రన్ అవుతూ ఉంటాయి. అవి మీ ఇంటర్నెట్​ వాడుకుంటూ, దాని స్పీడ్​ను తగ్గిస్తాయి. కనుక అవసరం లేని యాప్స్​ను క్లోజ్ చేయడమే మంచిది.
  3. క్లియర్​ కాషే : మనం ఏదైనా వెబ్​సైట్​, యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు చాలా డేటాను చూస్తాం. కానీ మనకు తెలియకుండానే ఫోన్​లో చాలా కాషే (Cache) స్టోర్ అయిపోతూ ఉంటుంది. వాస్తవానికి దీనివల్ల లోడింగ్ టైమ్ స్పీడ్​ పెరుగుతుంది. కానీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. అందువల్ల మీ ఫోన్​లోని కుకీస్​ను, కాషేను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడమే బెటర్​.
  4. ఫ్లైట్​ మోడ్​ : ఇంటర్నెట్ స్పీడ్ బాగా తగ్గిపోయినప్పుడు సింపుల్​గా మీ మొబైల్​లో ఫ్లైట్​ మోడ్​ను ఆన్​ చేసి, తరువాత దానిని ఆఫ్ చేయాలి. దీని వల్ల మీ ఇంటర్నెట్ కనెక్షన్​ రీసెట్​ అవుతుంది. ఇంటర్నెట్ స్పీడ్ ఆటోమేటిక్​గా పెరుగుతుంది.
  5. డేటా ఆఫ్​ : నెట్ స్పీడ్​ బాగా తక్కువగా ఉంటే, సింపుల్​గా మీరు మీ మొబైల్ డేటాను ఆఫ్​ చేసి కొద్ది సేపు అలానే ఉంచండి. తరువాత మళ్లీ డేటా ఆన్​ చేసి చూడండి. అప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే ఛాన్స్ ఉంది.
  6. ఫోన్​ అప్డేట్​ : కొందరు మొబైల్​ ఫోన్​ను ఎప్పటికప్పుడు అప్​డేట్ చేయకుండా అలానే వాడేస్తుంటారు. దీని వల్ల కూడా ఇంటర్నెట్ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కనుక మీ మొబైల్ డివైజ్​ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.
  7. డీఎన్​ఎస్​ సర్వర్​ : DNS సర్వర్ మార్చుకోవడం ద్వారా నెట్ స్పీడ్​ పెంచుకోవచ్చు.
  8. డేటా సేవింగ్ మోడ్​ : లేటెస్ట్ ఫోన్స్ అన్నింటిలో డేటా సేవింగ్ మోడ్​ అనే ఆప్షన్ ఉంటోంది. దానిని ఎనేబుల్ చేసుకుంటే ఇంటర్నెట్ వేగం పెరిగే ఛాన్స్ ఉంటుంది.
  9. స్టాప్​ ఆటో అప్డేట్​ : మీ ఫోన్​లో ఆటో అప్డేట్ ఫీచర్ ఆన్​ చేసి ఉంచితే, అది బాగా ఇంటర్నెట్​ను వాడుకుంటుంది. దీని వల్ల యాప్​లు ఎప్పటికప్పుడు అప్​డేట్ అవుతూ ఉంటాయి. కానీ ఇంటర్నెట్ వేగం మాత్రం తగ్గిపోతుంది. అందుకే మీ ఫోన్​లోని ఆటో-అప్​డేట్​ ఆప్షన్​ను డిజేబుల్ చేయండి. దీని వల్ల నెట్ స్పీడ్​ పెరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.