నాగార్జునసాగర్ జలాశయం వద్ద రెండో రోజు 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయటం వల్ల పర్యటకుల సందడి నెలకొంది. సందర్శకులు అధికసంఖ్యలో వస్తున్నందున ట్రాఫిక్ జామ్‌తో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలను దారి మళ్లించేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. స్వీయ చిత్రాల మోజులో పడి ప్రమాదాలు కొని తెచ్చుకొవద్దని అధికారులు పర్యటకులకు సూచించారు. 8 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రావటం వల్ల 26 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి... 5 లక్షల 76 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 573 అడుగులకు చేరగా... 265 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇవీచూడండి: 'మహోన్నత వ్యక్తిత్వం సుష్మాస్వరాజ్ సొంతం'