నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా బస్టాండ్ ఆవరణలో ప్రమాదం జరిగింది. నల్గొండకు చెందిన చంద్ర కాంత్ అనే ప్రయాణికుడు హాలియా బస్టాండులో బస్సు దిగుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చంద్రకాంత్ కుడికాలు పైనుంచి బస్సు టైరు వెళ్లి తీవ్రగాయాలపాలయ్యాడు. విషయం గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడం వల్ల ప్రాణాపాయం తప్పింది. వెంటనే స్థానికులంతా కలిసి యువకుడిని నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చంద్రకాంత్‌కు కుడి కాలుకు స్వల్ప అంగ వైకల్యం ఉంది. ఈయన నల్గొండ నుంచి పని నిమిత్తం హాలియాకు వస్తున్నట్లు తెలిపాడు.
ఇవీ చూడండి: 'కేకే ఆహ్వానిస్తే చర్చలకు సిద్ధం'