ETV Bharat / state

తెలంగాణపై ప్రియాంక గాంధీ ఫోకస్, మునుగోడు ప్రచారానికి వచ్చే అవకాశం

Priyanka Gandhi on Munugode By Poll సమన్వయంతో పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్ర నేతలకు ప్రియాంకాగాంధీ దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయాలని సూచించారు. అందరికంటే ముందుగా ప్రచార బరిలో నిలవాలని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు చాలా చిన్నవని అభిప్రాయపడ్డ ఆమె, ఎలాంటి సమస్య ఉన్నా తాను అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Priyanka Gandhi on Munugode By Poll
Priyanka Gandhi Focus on Munugode By Polls
author img

By

Published : Aug 23, 2022, 9:42 AM IST

Priyanka Gandhi on Munugode By Polls: మునుగోడు ఉపఎన్నిక, నేతల మధ్య అభిప్రాయబేధాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. దిల్లీలో కేసీ వేణుగోపాల్‌ నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. ఇందులో ప్రియాంకగాంధీ, మాణిక్కం ఠాగూర్‌ పాల్గొన్నారు. భేటీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో పాటు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జీవన్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, మధుయాస్కీ హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. రేవంత్ రెడ్డితో సహా మిగతా నాయకులందరితో ప్రియాంక గాంధీ విడిగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తెలుసుకున్నారు. రాష్ట్ర నాయకత్వంపై నేతల అభిప్రాయాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. మునుగోడులో వాస్తవ పరిస్థితిని సర్వేల ఆధారంగా చేసుకొని పార్టీ స్థితిగతులను రేవంత్‌... ప్రియాంక గాంధీకి వివరించినట్లు సమాచారం. సీనియర్లు కొందరు కలిసి రావడం లేదని.. వారు మీడియా ముందుకు వెళ్లడం కారణంగా పార్టీకి జరుగుతున్న నష్టం గురించి చెప్పినట్లు తెలుస్తోంది. నాయకులెవ్వరూ తక్కువ అని భావించకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని.. పార్టీని గెలిపించాలని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ నేతలతో నిష్పక్షపాత ధోరణితో వ్యవహరించాలని...అందరికి అందుబాటులో ఉండాలని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌కు ప్రియాంక గాంధీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీనియర్లను కలుపుకుని అందరి అభిప్రాయాలు తీసుకుని బాధ్యతగా పనిచేస్తేనే... పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసినట్లు వెల్లడించాయి. ఒకవేళ కలిసికట్టుగా లేకపోతే మునుగోడులో భాజపా చొచ్చుకువచ్చే అవకాశం ఉందని ప్రియాంక అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపాయి. ఈ క్రమంలో త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారబరిలో నిలవాలని సూచించినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.

ప్రియాంక గాంధీతో సమావేశానికి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆయన సోనియాగాంధీకి లేఖ రాశారు. పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రచారంలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు. అయితే... అత్యవసరంగా సమావేశం పెట్టడంతో కోమటిరెడ్డి రాలేకపోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. వారి విషయంపైనా భేటీలో చర్చ జరిగిందని పేర్కొన్నారు. వెంకట్‌ రెడ్డి ఆవేదనను అధిష్ఠానం అర్థం చేసుకుందన్న రేవంత్‌.. అభ్యర్థి విషయంలో వారి సూచనలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. పార్టీలో మనస్పర్థలు సహజమని...అవన్ని సమసిపోతాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కీ అన్నారు. కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డిని కలిసి వారితో మాట్లాడతామని పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నప్పటికీ.. మునుగోడు ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

ఇవీ చూడండి.. మునుగోడు ప్రచారంతో నాకేం సంబంధమన్న కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.