హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను దింపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా కేంద్రం శివారులోని చర్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని గాయత్రి ట్రావెల్స్‌కు చెందిన ఏపీ39ఎక్స్ 3654 నంబరు గల బస్సు ఇంజిన్‌లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో వాహనంలో 40 మంది ప్రయాణిస్తున్నారు. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై అందరిని దించేశాడు. అనంతరం క్షణాల్లోనే బస్సు కాలి బూడిదైపోయింది. అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు.
ఇవీ చూడండి: ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్‌ను: కేసీఆర్