ప్రణయ్ హత్య కేసు విషయంలో తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ అమృతను బెదిరించిన ఆమె తండ్రి మారుతీ రావుతోపాటు... మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి చెప్పినట్లు వింటే ఆస్తి మొత్తం రాసిస్తాడంటూ కందుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి... అమృతతో రాయబారం నడిపే ప్రయత్నం చేశాడు. జరిగిన తతంగంపై ఆమె పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది.
వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తే మారుతీరావు, కరీం తనను పంపినట్లు అంగీకరించాడు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా... న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరిని మిర్యాలగూడ సబ్ జైలుకు తరలించారు.
ఇవీ చూడండి: మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు