ETV Bharat / state

దుర్గం ఖిల్లాలో రూపుదిద్దుకోనున్న ఉద్యానం

రేచర్ల వంశీయులు, వెలమనాయుడులు ఏలిన చరిత్రాత్మక దేవరకొండ ఖిల్లాదుర్గం రూపుమారనుంది. కొండలు, రాళ్లతో నిండిన ఈ ప్రాంతం అందమైన పర్యాటక కేద్రంగా రూపుదిద్దుకుంటోంది. సుందరమైన ఉద్యానంగా తీర్చిదిద్దేందుకు సర్కారు పదికోట్ల నిధులను విడుదల చేసింది.

author img

By

Published : Jul 7, 2019, 8:05 PM IST

దుర్గం ఖిల్లాలో రూపుదిద్దుకోనున్న ఉద్యానం

నల్గొండ జిల్లా దేవరకొండ ఖిల్లా దుర్గంకు మహర్ధశ పట్టనుంది. నాగార్జునసాగర్​, హైదరాబాద్​ రహదారి సమీపంలో దేవరకొండ పట్టణంలో ఉన్న ఈ దుర్గం వద్ద ఉద్యానం రూపుదిద్దుకోనుంది. ఐదెకరాల ప్రాంగణంలో పార్క్​ను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఇందులో చిల్డ్రన్​పార్క్​, జలపాతం, వాకింగ్​ట్రాక్​, క్యాంటీన్​, పౌంటేన్​, ఓపెన్​ జిమ్​ వంటి వసతులు సమకూరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రజల అభీష్టం నెరవేరనుంది

2012లో దేవరకొండ నగర పంచాయతీగా ఏర్పడిననాటి నుంచి పార్క్​కావాలంటూ స్థానికులు డిమాండ్​ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే పురావస్తు శాఖ అనుమతి లభించడం వల్ల పార్కు నిర్మానానికి మార్గం సుగమమైంది. నిర్మాణం పూర్తయితే అటవీ శాఖ కార్యాలయం నుంచి నేరుగా బొడ్రాయి బజార్​ మీదుగా ఖిల్లాకు చేరుకోవచ్చు. దీనికి సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

దుర్గం ఖిల్లాలో రూపుదిద్దుకోనున్న ఉద్యానం

ఇదీ చూడండి: సందడిగా జాతీయ స్థాయి శరీర సౌష్ఠవ పోటీలు

Intro:TG_NLG_31_07_KILLALO_PARK_PKG_TS10103

అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా

ఫోన్:8008016365

Body:రేచర్ల వంశీయులు, వెలమనాయుడులు ఏలిన చరిత్రాత్మక దేవరకొండ ఖిల్లాదుర్గం రూపు మారనుంది.ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని అప్పట్లో కవిసార్వభౌముడు శ్రీనాధుడు సందర్శించినట్లు చెప్పే ఆనవాళ్ళున్నాయి.చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా ఖిల్లా దుర్గం రూపురేఖలు మార్చి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 10 కోట్ల నిధులను మంజూరు చేసింది.దీంతో అందమైన పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. LOOK....

VOICE OVER : నల్లగొండ జిల్లా దేవరకొండ ఈ పెరు వినగానే వెంటనే గుర్తుకువచ్చేది చుట్టూ ఎత్తైన కొండలు రాజులు పరిపాలించిన దుర్గం.నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ రహదారికి సమీపంలో దేవరకొండ పట్టణంలో ఉన్న ఖిల్లా దుర్గం దిగువభాగంలో ఐదు ఎకరాల్లో అందమైన ఉద్యానం(పార్క్‌)ను ఏర్పాటుచేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.10కోట్లు మంజూరు చేసింది. పిల్లల కోసం చిల్డ్రన్‌ పార్క్‌, ఖిల్లా ఎగువభాగం నుంచి ఉదయం జాలువారే జలపాతం, రాత్రివేళలో విద్యుత్తు కాంతులతో మెరుస్తూ చూపరులను ఆకట్టుకునే విధంగా జలపాతం ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటితోపాటు వాకింగ్‌ ట్రాక్‌, క్యాంటీన్‌, పౌంటెయిన్‌, ఓపెన్‌ జిమ్‌ వంటివి సమకూరుస్తున్నారు. పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదం కరవై కనీసం ఉదయం నడక(వాకింగ్‌)కు వెళ్లలేని పరిస్థితి ఉంది. వృద్ధులు, చిన్నారులు ఆహ్లాదంగా గడపడానికి ఉద్యానం ఏర్పాటు చేయాలని ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. 2012లో దేవరకొండ నగర పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి పార్క్‌ ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అది కాస్త ముందుకు పడలేదు. నూతన హంగులు సమకూర్చడానికి పురావస్తుశాఖ అనుమతి లభించింది. పర్యాటకులు అటవీ శాఖ కార్యాలయం నుంచి నేరుగా బొడ్రాయి బజార్‌ మీదుగా ఖిల్లాకు చేరుకోవచ్చు. ఇందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Conclusion:బైట్: రవీంద్ర కుమార్ ( ఎమ్మెల్యే,దేవరకొండ,నల్లగొండ జిల్లా )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.