నల్గొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి పవర్ ప్లాంట్ వలసకూలీలు కాలినడకన వీధిన పడ్డారు. తమను స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల కాలినడకనే సొంతూళ్లకు బయలుదేరారు. వారంతా మిర్యాలగూడకు చేరుకోగా.. అప్రమత్తమైన అధికారులు .. అడ్డుకుని జిల్లా సరిహద్దు దాటే వరకు లారీలు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.
కరోనాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులే దగ్గరుండి మరీ.. వాహనాల్లో వలస కూలీలను గుంపులు గుంపులుగా పంపించారు.
అధికారుల తీరుపై స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వలస కూలీలను రాష్ట్ర సరిహద్దు వరకు పంపే ఏర్పాటు చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.