ETV Bharat / state

Uttam Kumar: కమీషన్లపై ఉన్న శ్రద్ధ కొనుగోళ్లపై లేదు : ఉత్తమ్‌ - వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన ఎంపీ

ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్ డిమాండ్‌ చేశారు. నల్గొండలో వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన ఆయన.. ధాన్యం కొనుగోళ్లలో తెరాస సర్కారు విఫలమైందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ప్రాజెక్టులు, కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు.

Nalgonda MP uttam kumar
నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్
author img

By

Published : Nov 7, 2021, 6:27 PM IST

ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టే ప్రభుత్వం ధాన్యం కొనలేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టులు, కమీషన్లపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. నల్గొండలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన ఉత్తమ్‌... రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అక్కడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నల్గొండలో రైతులు 16 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారని.. అధికారులు ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. మద్దతు ధర రూ.1,960కి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. వరి పంట వేయొద్దని ప్రభుత్వమే చెప్పడం చాలా దుర్మార్గమని ఆయన ఆక్షేపించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని ఈ సందర్భంగా ఉత్తమ్‌ స్పష్టం చేశారు. పంట బీమా పథకం తెలంగాణ మినహా దేశవ్యాప్తంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రుణమాఫీ, పంట బీమా అమలు చేయడం లేదని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు.

Nalgonda MP uttam kumar

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం స్పష్టంగా ధాన్యం కొనుగోళ్లపై నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంత అసమర్థ ప్రభుత్వం ఉంటుందని ఎవరూ అనుకోరు. కేవలం ప్రాజెక్టుల్లో లక్షల కోట్ల కమీషన్లపై ఉన్న శ్రద్ధ ధాన్యం కొనుగోళ్లపై లేదు. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా మద్దతు ధర రూ.1,960కి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది వరి రైతులు ఉన్నారు. ప్రతి గింజను కొనుగోలు చేయాలి. ప్రభుత్వాలు ఉండేదే రైతులను కాపాడేందుకు.. వరి వేయొద్దని చెప్పడం చాలా దుర్మార్గం. రబీలో వరి వద్దని చెప్పడం చాలా తప్పుడు నిర్ణయం. ఈ విషయాన్ని కాంగ్రెస్ తరఫున వ్యతిరేకిస్తున్నాం. రైతులంతా వరి వేయండి. మేము మీకు అండగా ఉంటాం. ఇంతవరకు రైతు రుణమాఫీ జాడలేదు. లక్ష రుణమాఫీ ఏమైంది. రెండేళ్లలో ఇక మీ పని ఖతం. పంట బీమా కేవలం మన రాష్ట్రంలోనే లేదు. దేశ వ్యాప్తంగా అమలవుతున్నా మన రాష్ట్రంలో ఎందుకు లేదు. క్రాప్​ ఇన్సూరెన్స్ అమలు చేయరు, రుణమాఫీ ఇవ్వరు.. రైతులు ధాన్యం పండిస్తే కొనరు. మరీ మీరంతా ఉన్నది ఎందుకు? కాంగ్రెస్ రైతుల తరఫున పోరాడుతుంది. మీకు అండగా నిలబడుతుంది. - ఉత్తమ్​ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ

ఇదీ చూడండి:

Farmers Problems: అన్నదాతల అరిగోసలు.. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.